bannerImage

Philosophy

అవధాన కళా వైభవం పై అంతర్జాతీయ కార్యశాల - January 09, 2025

Date: January 09, 2025
Duration:

1 day(s)

Venue:

Dr BR Ambedkar Seminar Hall- Govt College (A) rjy

Target:

Students

Number of Participants:

200

9/1/2025 అవధాన కళా వైభవం పై అంతర్జాతీయ కార్యశాల ప్రభుత్వ కళాశాల(అ) రాజమహేంద్రవరం, లలిత కళలు తెలుగు మరియు సంస్కృత శాఖ సంయుక్త ఆధ్వర్యంలో అంబేద్కర్ సెమినార్ హాల్ నందు అవధాన కళా వైభవం పై ఒక రోజు అంతర్జాతీయ కార్యశాల కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఈ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలన, కళాశాల విద్యార్థి నృత్యంతో, ఆంగ్ల శాఖ నూజిళ్ళ శ్రీనివాస్ గారి రాజమహేంద్రవరానికీ తల మానికము ఆర్ట్స్ కళాశాల" అనే కళాశాల గీతాలాపనతో అతిథులందరి అధ్యక్షతన ఈ అవధాన కార్యక్రమం మొదలైంది. సీతామహాలక్ష్మి లలిత కళల విభాగాధిపతి అవధాన కార్యక్రమం ఉద్దేశం గురించి మాట్లాడుతూ సర్టిఫికెట్ కోర్స్ లలిత కళ విభాగం నుండి విద్యార్థులకు నిర్వహించారని తెలియజేస్తూ కళాశాల నుండి భారతీయ విజ్ఞాన వ్యవస్థను పురస్కరించుకొని కళాశాల ప్రిన్సిపాల్ డా. రామచంద్ర ఆర్కే అవధానంపై అంతర్జాతీయ కార్యక్రమం నిర్వహించాలని సూచించారని కృతజ్ఞతా పూర్వకంగా మాట్లాడారు. భారత కళ అయిన అవధాన వైభవం విద్యార్థులకు తెలియాలంటే కళా ద్రష్టలకు, విద్యార్థులకు ఒక సమావేశం ఏర్పాటు కావాలని, తద్వారా వచ్చే స్ఫూర్తిని భావితరాలకు అందించాలని తెలియజేశారు కళాశాల ప్రిన్సిపాల్ డా. రామచంద్ర ఆర్కే అధ్యక్ష ఉపన్యాసం చేస్తూ అవధానం అంతరించిపోతున్న కళ, భారతీయ విజ్ఞానానికి ఒక పునాది రాయి లాంటిది. రాజమహేంద్రవరం కళలకు పుట్టినిల్లు , ఆర్ట్స్ కళాశాలలో అవగాహన కళలపై ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్స్ ని దిగ్భజయంగా పూర్తి చేశారు. లలిత కళల విభాగం నుండి అవధానం కి సంబంధించిన మల్టీ టాస్కింగ్ అశువుగా అప్పటికప్పుడు అరక్షణంలో చెప్పాలంటే అవధానం ఉపయోగపడుతుందని, ఒక దాని మీదే ఏకాగ్రత కాకుండా మల్టీ టాస్కింగ్ కెపాసిటీ, మెమొరీ పవర్, పెంచుతుందని అష్టావధానం, శతావధానం, ఎదుటివారి ప్రశ్నలకు సమాధానం చెబుతూ అలవోకగా సమస్యా పూరణ, పద్య పూరణ వంటివి చేసే సామర్థ్యం పెంచుతుందని, సాధన చేసి విద్యార్థులు ఈ కళను అవలంబించాలని మేదమెట్టి లాజికల్ థింకింగ్ ను అందిపుచ్చుకోవాలని నిర్దేశించారు. శ్రీ తటవర్తి కళ్యాణ చక్రవర్తి ఆస్ట్రేలియా నుండీ ఆన్లైన్ లో పాల్గొని కీలకోపన్యాసం చేశారు. సాహిత్యాన్ని సమాజ సేవతో ముడివేసి అవధాన ప్రక్రియను ప్రజల్లోకి తీసుకెళుతున్న ఆదర్శ ప్రముఖులు. రాజమహేంద్రవరం తెలుగు భాషకు వరం. ప్రజ్ఞ విజ్ఞానాలను నేర్పే కళ అవధానం. విన్నది విన్నట్లుగా చెప్పింది చెప్పినట్లుగా తిరిగి చెప్పగల మేధస్సును అందిస్తుంది. ఈ అవధానం వేదాల నుండి వస్తున్న పరంపర అని తెలియజేశారు. డా. గౌతమ్ భూగర్భ శాస్త్ర విభాగాధిపతి మాట్లాడుతూ భారతీయ విజ్ఞాన పరంపర అవధాన కళఅని, తెలుగువారు గర్వించదగ్గ కళ అవధాన కళఅని కొనియాడారు. డా. ఎం. సుధామయి తెలుగు అధ్యాపకురాలు, మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పేరున ఆలోచన శక్తి తగ్గిపోతుంది . అవధానం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఏకాగ్రత అవసరం జ్ఞాపక శక్తి పెంపు, ఏకాగ్రత సాధన, త్వరిత ఆలోచన, విశ్లేషణాత్మక ఆలోచన, బహుళ మేధస్సు అందిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమానికి వృక్ష శాస్త్ర విభాగాధిపతి శ్రీనివాస్, భూగర్భ శాస్త్రవేత్త విభాగాధిపతి డా. గౌతమ్, భౌతిక శాస్త్ర విభాగం నుండి డా.సంజీవ్, సంస్కృత విభాగాధిపతి, తెలుగు శాఖ అధిపతి డాక్టర్ పి. ఏ. సత్యనారాయణ, డా. ప్రిస్కిల్లా, వివిధ విభాగాల అధ్యాపకులు ఆధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Organizer(s):

Department of Fine Arts, in association with the Departments TELUGU, SANSKRIT

Our Gallery

More Activities

View all